తెలుగు ఆరాధన · WORD & SONG
SONG 01
అంకితం నీకే దేవా – అందుకోవయ్యా | Ankitham Neeke Devaa – Andukovayyaa
అంకితం నీకే దేవా – అందుకోవయ్యా (2)
అంకితం ప్రభో ఆశ్రయంబుల్ ఆశలెల్ల – అంకితమయ్యా
దుర్మార్గులు నిను దూషించిననూ
దు:ఖము కలిగిననూ (2)
కరుణను నొసగి కాచిన దేవా (2)
కానుకలివిగోనయా ||అంకితం||
పాపములెల్ల పరుగిడజేసి
పావనులను జేసి (2)
పరమ రహస్యం కనుగొన జేసి (2)
పతకము నొసగుమయా ||అంకితం||
నీవు ఒసగిన ఈవులనెల్ల
నీ సేవ కొరకే (2)
అణకువతోడ అర్పణ జేతు (2)
అల్పులగాంచుమయా ||అంకితం||